కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు గురు వారం నష్టాల పాలయ్యాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 580 పాయింట్లు కోల్పోయి 43,600 వద్ద, ఎన్ఎస్ఈ-నిఫ్టీ 166 పాయింట్ల నష్టంతో 12,772 వద్ద ఆగాయి. కరోనా భారీగా పెరుగుతు న్నందున మదు పరుల నమ్మకాన్ని దెబ్బ తీసింది. ఫలితంగా వారంతా ఇటీవల నమోదైన భారీ లాభాలను సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. బ్యాంకింగ్, టెలికాం, ఆటో షేర్లు భారీగా కుదేలయ్యాయి. విద్యుత్ రంగ షేర్లు మాత్రం లాభాలను గడించాయి. పవర్గ్రిడ్, ఐటీసీ, ఎన్టీపీసీ, టాటా స్టీల్, టైటాన్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు లాభాలను నమోదు చేశాయి.ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫినాన్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. డాలర్తో పోలిస్తే మారకం విలువ 74.27 వద్దకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో పీపా ముడి చమురు ధర 44.05 డాలర్లు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos