పిసినారి భారతం

పిసినారి భారతం

న్యూఢిల్లీ : భారత్ పిసినారిగా దిగజారింది. గత పదేళ్లలో 128 దేశాల్లో భారత్కు 82వ స్థానం లభించింది. ’భారతీయుల్లో ప్రతి మూడో వ్యక్తి అపరిచితుడికి సాయం చేసారు. ప్రతి నలుగురిలో ఒకరు డబ్బును దానం చేసారు. ప్రతి ఐదుగురిలో ఒకరు ఇతరుల కోసం స్వచ్ఛందంగా తమ సమయాన్ని కేటాయించార’ని వరల్డ్ గివింగ్ ఇండెక్స్ పదవ నివేదికలో వెల్లడించింది. దాతృత్వంలో భారత్, పొరుగునున్న పాకిస్థాన్, నేపాల్ కంటే వెనుకబడింది. 128 దేశాల్లోని 13 లక్షల మంది అభిప్రాయాలను గత తొమ్మిదేళ్లుగా సమీకరించి, సమీక్షించి వరల్డ్ గివింగ్ ఇండెక్స్ నివేదికను తయారు చేసింది. 2010లో దాతృత్వంలో భారత దేశ స్థానం 134 ఉండగా, నిరుడు గణనీయంగా 81 స్థానానికి చేరుకుంది. మళ్లీ ఈ ఏడాది ఒక స్థానం పెరిగి 82కు చేరు కుంది. దాతృత్వంలో భారతీయులకు 26 శాతం, అమెరికాకు అత్యధికంగా 58 శాతం, ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందిన చైనా కేవలం 16 శాతం మార్కుల్ని గడించాయి. అపరిచుతులకు సహాయం చేయడం, ధనసాయం, ఇతరుల సంక్షేమం కోసం స్వచ్ఛంగా సమయాన్ని కేటాయించటాల్లో న్యూజిలాండ్ అగ్రగామిగి నిలిచింది.‘భారత్లో పేదవాడే, పేదవాడికే సాయం చేస్తు న్నారు. ధనికుల వద్ద రూ.21 లక్షల కోట్లు మూలుగుతున్న వారు అపరిచితుల్ని ఆదుకోవటం లేదు.ముస్లింలు అధికంగా ఉన్న ఇండోనేసియా కూడా టాప్ టెన్లో ఉంది. ఇతరులకు దానం చేయాలనే సూక్తి వారి ఇస్లాంలో ఉండడం, దాన్ని అక్కడి ప్రజలు బలంగా నమ్మడం ఇందుకు కారణం. చాలా దేశాల్లో దాన గుణం ఎక్కువ, తక్కువ ఉండడానికి కారణం వారి సంస్కృతులు, మత విశ్వాసాలు, వాటి పట్ల ప్రజలకున్న నమ్మకాలే కారణమని అధ్యయనం తేల్చింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos