త్వరలో పెళ్లి కబురు చెబుతా..

  • In Film
  • August 7, 2019
  • 107 Views
త్వరలో పెళ్లి కబురు చెబుతా..

త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్లు మిల్కీబ్యూటీ తమన్నా వెల్లడించింది.ఇప్పటికే ఇంట్లో సంబంధాలు వెతకడం మొదలుపెట్టారని త్వరలోనే పెళ్లి కబురు చెబుతానని తెలిపింది.పెళ్లి విషయంలో నిర్ణయం పూర్తిగా తల్లితండ్రులకు వదిలేశానని తల్లితండ్రులు చూసిన వరుడిని పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది.ఇదివరకు వివాహమై విడాకులు తీసుకున్న గతంలో కలసి నటించిన ఓ సహనటుడితో తమన్నా ప్రేమలో ఉన్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తను ఎవరితో రిలేషన్ లో లేనని తమన్నా వెల్లడించింది. తరువాత ముంబైకి చెందిన వ్యాపారితో తమన్నా ప్రేమలో ఉందని మీడియాలో వార్తలు వినిపించాయి. వాటిని కూడా ఖండించింది బ్యూటీ. తనపై ఇలాంటి వార్తలు వచ్చిన ప్రతీసారి తమన్నా క్లారిటీ ఇస్తూనే ఉంది.తాజాగా త్వరలోనే పెళ్లి కబురు చెబుతానంటూ స్పష్టం చేసి తనపై వస్తున్న ఊహాగానాలకు చెక్‌ పెట్టింది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos