సుస్థిర సర్కారు అసాధ్యం

సుస్థిర సర్కారు అసాధ్యం

బెంగళూరు: ప్రస్తుత పరిస్థితుల్లో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు ఎవరి వల్లా సాధ్యం కాదని కర్నాటక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కుమార స్వామి గురువారం ఇక్కడ వ్యాఖ్యా నించారు. కాంగ్రెస్-జేడీఎస్ తిరుగుబాటు శాసనసభ్యుల రాజీనామా ఉప ఎన్నికలకు దారి తీసిందన్నారు. ‘ప్రస్తుతమున్న పరిస్థి తుల్లో ఎన్నికలు జరిగినా సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు సాధ్యం కాద’న్నారు. మనసు మార్చుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ తిరుగుబాటు శాసన సభ్యుడు రామలింగారెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు కర్నాటక భాజపా అధిష్ఠానం ఆదేశాల కోసం వేచి చూస్తోంది. తిరుగుబాటు విధానసభ సభ్యులు సమర్పించిన రాజీనామాల గురించి సభాపతి రమేశ్ కుమార్ ఇంకా ఏ నిర్ణయాన్ని కూడా తీసుకో లేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos