టాలీవుడ్ అగ్రహీరోపై విరుచుకుపడ్డ శ్రీరెడ్డి..

  • In Film
  • August 8, 2019
  • 84 Views
టాలీవుడ్ అగ్రహీరోపై విరుచుకుపడ్డ శ్రీరెడ్డి..

దక్షిణాది చిత్ర పరిశ్రమలో శ్రీరెడ్డి గురించి తెలియని నటీనటులు,ప్రేక్షకులు ఉండరేమో.క్యాస్టింగ్‌ కౌచ్‌పై జాతీయస్థాయిలో చర్చించుకునేలా రచ్చ చేసిన శ్రీరెడ్డి సామాజిక మాధ్యమాల్లో తరచూ తెలుగు,తమిళ,హిందీ చిత్ర పరిశ్రమల నటీనటులపై సంచలన పోస్ట్‌లు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటోంది.ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో నానితో పాటు వెంకటేశ్‌ కుటుంబం,చిరంజీవి కుటుంబంపై తీవ్రస్థాయిలో విమర్శలు,ఆరోపణలు గుప్పించే శ్రీరెడ్డి తాజాగా మరోసారి మరో టాలీవుడ్‌ అగ్రహీరోపై ఫేస్‌బుక్‌ ఖాతాలో విమర్శలు చేసింది. ‘అతడు టాలీవుడ్‌లోనే డమ్మీ హీరో. అరవై ఏళ్లు వచ్చినా డబ్బుల కోసం చచ్చిపోతాడు. ఆ హీరోకు కార్లంటే ఎంతో పిచ్చి. అందుకే ఆయన దగ్గర వందల కార్లు ఉన్నాయి. అంతేకాదు, ఆయనో ఫిజిక్ లవర్. ఇంతకీ ఎవరా హీరో?’ అని అందులో పేర్కొంది. దీంతో ఈ పోస్టులో శ్రీరెడ్డి పేర్కొన్న హీరో ఎవరనే చర్చ జరుగుతోంది.ఇంతకీ ఆ ‘అందగాడు’ ఎవరో మీకేమైనా తెలిసిందా?

dummy hero of d tolywood,he die for cash aftr crosng 60s also.dis hero hs hunders of crs nd crazy abt cars,physic lover who is he?

Posted by Sri Reddy on Wednesday, August 7, 2019

తాజా సమాచారం

Latest Posts

Featured Videos