స్పీడ్‌ బ్రేకర్లు తొలగిస్తాం

స్పీడ్‌ బ్రేకర్లు తొలగిస్తాం

ప్రజావాహిని-బెంగళూరు

జిల్లాధికార్లు, పోలీసుల సూపరెంటెండెంట్లను సంప్రదించి  రాష్ట్ర వ్యాప్తంగా రహదార్లులో అక్రమంగా వేసిన స్పీడ్‌ బ్రేకర్లను తొలగిస్తామని ప్రజాపనుల మంత్రి సి.సి.పాటిల్‌ సోమవారం విధాన సభలో తెలిపారు. శ్రీనివాసపురం సభ్యుడు రమేశ్‌ కుమార్‌ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు బదులిచ్చారు. హొసకోటె-మాడికెరె మధ్య 33స్పీడ్‌ బేక్రర్లు ఉన్నాయి. ముళబాగిలు చిక్కబళ్లాపుర మధ్య దూరం 84.కి.మీలు . ఆ మార్గంలో 84 స్పీడ్‌ బ్రేకర్లుండగా వీటిలో ఒక్కటి మినహా మిగిలిరనవన్నీ అక్రమ మైనవని బదులిచ్చారు. దీంతో రమేశ్‌ కుమార్‌ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రహదార్ల ఇంజనీర్లు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయక పోవటం వల్లే వి పుట్టుకు వచ్చాయని విమర్శించారు. వారిని వెంటనే సస్పెండు చేయాలని డిమాండు చేసారు. దీనికి పాటిల్‌ వ్యతిరేకంగా స్పందించటంతో రమేశ్‌ కుమార్‌ మండి పడ్డారు. తనకు జరిగిన అవమానంగా ఆక్రోశించారు. తను ప్రశ్నను ఉపసంహరించుకుటానని, దీనిపై జరిగిన చర్చను దాఖలాల నుంచి తొలగించాలని కోరారు. ‘హొసకోట నుంచి అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే  దారిలో కార్లతో బాటు  ఆటోలు, ద్వి చక్రవాహనాల్ని అనుమతిస్తారు మరో వైపు పోలీసులు వేగంగా వాహనాలు వెళ్లకుండా తనిఖీ చేస్తుంటారు. విదేశాలకు వేళ్ల దలచిన వారు ఆ మార్గంలో ప్రయాణిస్తే సకాలంగా గమ్యాన్ని చేరుకోజాలరు. వారి కోసం ఆ విమానాలు వేచి ఉండవు . ఇలాంటి రహదార్లు ఎందుకు?’అని చీత్కరించారు. పోలీసులు ఈ సమస్యను పరిష్కరించలేరా? ప్రశ్నించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos