నితీశ్ సర్కార్ దారి తప్పింది

న్యూఢిల్లీ : నితీశ్ సర్కార్ దారి తప్పిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళ వారం విడుదల చేసిన వీడియో సందేశంలో మండిపడ్డారు. బిహార్ ప్రజలు మహాఘట్ బంధన్తోనే ఉన్నారని దీమా వ్యక్తం చేశారు. ‘‘అధికారం, అహంతో నితీశ్ ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నుంచి పక్కకు తప్పిపోయింది. నితీశ్ పాలనలో కార్మికులు నిస్సహాయులయ్యారు. రైతుల పరిస్థితి బాగోలేదు. యువత తీవ్ర నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అందుకే రాష్ట్ర ప్రజలు మహాఘట్ బంధన్ తో ఉన్నారు . దేశంలో ఆర్థిక వ్యవస్థ ఏమాత్రం సరిగ్గా లేదు. దాని ప్రభావం పేద ప్రజలపై తీవ్రంగా పడుతోంది. బిహార్ ప్రజలు తీవ్ర కష్టాల్లో ఉన్నారు. దళితులు, మహా దళితుల పరిస్థితి రాష్ట్రంలో చాలా దయనీయంగా ఉంది. వారందరూ మహాఘట్ బంధన్తోనే ఉన్నారు. ఢిల్లీ, బిహార్ ప్రభుత్వాలు బంధీ అయిన ప్రభుత్వాలు. నోట్లరద్దు, లాకౌట్, నిరుద్యోగం లాంటి సమస్యలతో కొట్టు మిట్టాడుతున్నాయి. బిహార్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. అదీ దగ్గర్లోనే ఉంది. ప్రజల చేతిలో నైపుణ్యం విపరీతంగా ఉంది. నిరుద్యోగిత, వలస కారణంగా వారి జీవితాల్లో మార్పు రావడం లేద’ని ఆక్రోశించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos