బిజెపి నాయకురాలు సోనాలి ఫోగట్‌ అరెస్ట్‌

బిజెపి నాయకురాలు సోనాలి ఫోగట్‌ అరెస్ట్‌

హిస్సార్: ప్రభుత్వ అధికారిని చెప్పుతో కొట్టారనే ఆరోపణపై టిక్టాక్ స్టార్, భాజపా నేత సోనాలి ఫోగట్ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు వారాల కిందట సోనాలి ఫోగట్ బాలాస్మంద్లోని ధాన్యం మార్కెట్ పని తీరును సమీక్షించినపుడు మార్కెట్ కార్యదర్శి సుల్తాన్సింగ్తో న వాగ్వాదానికి దిగారు. దరిమిలా ఆగ్రహానికి గురై ఆ అధికారిని చెప్పుతో కొట్టంది. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో సంచలనమైంది. ఆ అధికారి దుర్భాషలాడుతూ, తనను అవమానించడం వల్లే కొట్టాల్సి వచ్చిందని సంజాయిషీ ఇచ్చింది. తానేమీ అనక ముందే సోనాలి తనపై దాడి చేసి, చెప్పుతో కొట్టిందని పోలీసులకు ఫిర్యాదు చేసారు. నిరుడు ఆదంపూర్ విధానసభ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలైంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos