బాబు అవినీతిపై శ్వేత పత్రానికి భాజపా డిమాండు

బాబు అవినీతిపై శ్వేత పత్రానికి భాజపా డిమాండు

రాజమండ్రి: చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన అవినీతిపై ముఖ్యమంత్రి జగన్ శ్వేత పత్రాన్ని ప్రకటించాలని భాజపా విధాన పరిషత్తు సభ్యుడు సోము వీర్రాజు సోమవారం ఇక్కడ డిమాండు చేసారు. తెదేపా పాలనలో అవినీతికి పాల్పడిన వారిని అరెస్టు చేయటంలో జగన్ ఏడాది పాటు జాప్యం చేశారని తప్పుబట్టారు. దూకుడుగా వెళతానన్న జగన్ ఎందుకు జాప్యం చేస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. ఈఐస్ఐ కుంభకోణంలో అవినీతికి పాల్పడిన వారిని అరెస్టు చెస్తే చంద్రబాబు కాగడాల ప్రదర్శన చేయడం ఏంటని ప్రశ్నించారు. అవినీతికీ.. కులానికి సంబంధం లేదన్నారు. ఈఐస్ఐ కుంభకోణంలో అరెస్టు అయిన వారు అప్రూవల్గా మారితే నిజమైన అవినీతిపరులు జైలుకి వెళ్ళటం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి జగన్ అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. తెదేపా నేతల తరహాలోనే మట్టి, ఇసుకలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇసుక విధానంపై ముఖ్యమంత్రి జగన్కు అవగాహన లేదని వ్యాఖ్యానించారు. భూములు కొనుగోలులో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు 150 కోట్లు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos