అమ్మకాల జోరుతో మునిగిన స్టాక్ మార్కెట్లు

అమ్మకాల జోరుతో మునిగిన స్టాక్ మార్కెట్లు

ముంబై : స్టాక్ మార్కెట్లు మంగళవారం మళ్లీ నష్టాల్లోనే మునిగాయి. . ఆరంభంలో నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఒక దశలో లాభాల బాటలో పడి తిరిగి నష్టాల్లోకి జారాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 811 పాయింట్లు నష్టపోయి 30,579 వద్ద, నిఫ్టీ 230 పాయింట్లు నష్టపోయి 8,967 వద్ద ఆగాయి. మదుపర్లు అమ్మకాలకు ప్రాధాన్యత ఇవ్వటం ఇందుకు కారణం. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.74.23 వద్ద దాఖలైంది. నిఫ్టీలో యెస్ బ్యాంక్, హిందుస్థాన్ పెట్రోలియం, ఐషర్ మోటర్స్, హీరో మోటర్స్, హిందుస్థాన్ యూనీలివర్ షేర్లు లాభాల్ని గడించాయి. జీ ఎంటర్టైన్మెంట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఇన్ఫ్రాటెల్, యూపీఎల్ షేర్లు నష్టాల పాలయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 32వేల పాయింట్లను దాటి మంచి జోరులో ఉంది. మధ్యాహ్నానానికి సూచీలు నెమ్మదిగా పతనమవటం మొదలయ్యాయి. చివరి అరగంటలో మదుపరులు పోటీలు పడి అమ్మేసారు. లాభాలను కూడా కోల్పాతామనే భయం ఇందుకు కారణం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos