విచిత్రమైన వివాహ ప్రకటన

విచిత్రమైన వివాహ ప్రకటన

కోల్కతా: సామాజిక మాధ్యమాలకు బానిస కాని వధువు కావాలెను అని చటర్జి అనే వ్యక్తి ఇచ్చిన ప్రకటన ప్రస్తుతం సంచలనమైంది. దాన్ని చూసిన వారంతా ‘నీకు ఈ జన్మలో పెళ్లి కాదు’ అని కుండ బద్దలు కొడుతున్నారు. పశ్చిమ బంగ కమర్పూర్కు చెందిన చటర్జీ 37/5’7యోగా ప్రాక్టీషనర్. ‘అందమైన వ్యక్తి, ఎటువంటి దురలవాట్లు లేవు. హైకోర్టులో న్యాయవాది, పరిశోధకుడు. ఇళ్లు, కారు ఉన్నాయి. తల్లిదండ్రులు ఉన్నారు. కమర్పుకుర్లో మరో ఇల్లు, కట్నం కూడా వద్దు. అందమైన, పొడవైన, సన్నని వధువు కావాలి ముఖ్యంగా ఆమె సోషల్ మీడియాకు బానిస కాకూడదు’ అంటూ ఇచ్చిన ప్రకటన ప్రస్తుతం తెగ వైరలవుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos