మళ్లీ బ్యాటు పట్టిన స్మిత్

మళ్లీ బ్యాటు పట్టిన స్మిత్

దక్షిణాఫ్రికాలో జరిగిన సిరీస్‌ సందర్భంగా బాల్‌ ట్యాంపరింగ్‌కు
పాల్పడ్డాడనే ఆరోపణలతో ఏడాది పాటు క్రికెట్‌ ఆట నుంచి నిషేధానికి గురైన ఆసీస్‌ మాజీ
కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ మళ్లీ బ్యాట్‌ పట్టాడు. నిషేధానికి తోడు మోచేతి శస్త్ర చికిత్స
చేసుకున్న స్టీవ్‌, పూర్తిగా కోలుకొని, నెట్‌ ప్రాక్టీస్‌కు దిగాడు. శుక్రవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో
ఈ దృశ్యాన్ని పోస్ట్‌ చేశాడు. బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ సందర్భంగా గాయపడిన స్మిత్‌కు
జనవరిలో శస్త్ర చికిత్స జరిగింది. దీంతో అతను ప్రపంచ కప్‌తో పాటు ఐపీఎల్‌లో ఆడే అవకాశాలు
సన్నగిల్లాయని అందరూ భావించారు. తాను త్వరగా కోలుకుంటానని అతను ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఐపీఎల్‌లో  స్మిత్‌ రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం
వహిస్తుండగా, ఈ నెల 29న ఆ జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ నెల 23న ఐపీఎల్‌
ప్రారంభం కానుండగా, అదే రోజు స్మిత్‌పై నిషేధం తొలగిపోనుంది. అతనితో పాటు డేవిడ్‌ వార్నర్‌పై
క్రికెట్‌ ఆస్ట్రేలియా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. బాన్‌క్రాఫ్ట్‌పై విధించిన
తొమ్మిది నెలల నిషేధం తొలగిపోవడంతో ఇప్పటికే అతను సత్తా చూపుతున్నాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos