శబరి మల వివాదం విస్తృత ధర్మాసనానికి

శబరి మల వివాదం విస్తృత ధర్మాసనానికి

న్యూఢిల్లీ: శబరి మల వివాదం మళ్లీ మొదటికి వచ్చింది.అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమ తించాలా? వద్దా?  అనే అంశాన్ని ఏడుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనానికి అత్యున్నత న్యాయస్థానం ఐదుగురు సభ్యుల ధర్మా సనం గురువారం బదిలీ చేసింది. ధర్మాసనంలో అత్యధిక మెజార్టీ సభ్యుల అభిప్రాయానుసారం ఈ మేరకు నిర్ణయించింది. ఆలయ ద్వారాలు మరో రెండు రోజుల్లో తెరుచుకోనున్న వేళ గతంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అమలు కాకుం డా తాత్కాలికంగా నిలిపేందుకు నిరాకరించింది. ఆ తీర్పును పునఃసమీక్షించాలని దాఖలైన వ్యాజ్యాల్ని విచారించకుండా పక్కన బెట్టింది. సమీక్ష వ్యాజ్యాలతో బాటు పాటు అనేక రిట్ పిటిషన్లు దాఖలయ్యాయని న్యాయ స్థానం తెలిపింది. మతం అంతర్గత అంశాల గురించి చర్చించాలని కక్షదార్లను కోరింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి తీర్పు ను చదివారు. ‘మతం…మనిషికి, దైవానికి అనుసంధానం చేసేది మాత్రమే. మహిళల ప్రవేశానికి నిబంధనలు విధించడం జర గదు. శబరిమలలోకి మహిళల ప్రవేశం అనేది ఈ ఒక్క మతంతో ఆగదు. మసీదుల్లోకి మహిళల ప్రవేశం అంశం కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మతంలోకి చొచ్చుకొనే అధికారం కోర్టులకు ఉందా? అనే అంశం ఇప్పుడు చర్చకు వచ్చిందన్నారు. వ్యాజ్యాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసే అంశాన్ని ధర్మాసనంలో న్యాయమూర్తులు రంజన్ గొగొయి, ఖన్వీల్కర్, ఇందు మల్హోత్రా బలపర్చారు. చంద్రచూడ్, నారీమన్ గతంలో తాము ఇచ్చిన తీర్పునే కొనసాగించాలన్నారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos