మంత్రులపై ఆర్థిక శాఖ ఆధిపత్యం

మంత్రులపై ఆర్థిక శాఖ ఆధిపత్యం

ప్రజావాహిని-బెంగళూరు

‘రాష్ట్రంలో ఆర్థిక శాఖ ఆధిపత్యం కొనసాగుతోంది.  ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల సిఫార్సులనూ  ఖాతరు చేయటం లేదు. ఆర్థిక పరిస్థితి గురించి ముఖ్యమంత్రి గొప్పలు చెప్పుకున్నట్లు లేదు. ఆ శాఖే ఆర్థిక  స్థతి గతుల గురించి సభలో ప్రకటిస్తే బాగుంటుంద’ని బసవన బాగేవాడి సభ్యుడు శివానంద పాటిల్‌ శుక్రవారం విధానసభలో మండి పడ్డారు. బసవన బాగేవాడిలో మార్కెట్‌ నిర్మాణం 75 శాతం పూర్తయింది. మరో అంతస్తును వాహనా పార్కింగు కోసం అదనంగా కట్టారు. దీంతో నిధుల కొరత ఏర్పడింది. మరో రూ. ఏడు కోట్లు విడుదల చేస్తే నిర్మాణం ముగు స్తుంది. గత మూడు, నాలుగేళ్లుగా ఆర్థికశాఖ ఆ నిధులివ్వటం లేదు. మాజీ, ప్రస్తుత ముఖ్యమంత్రులు, మంత్రులు ఇందు కోసం చేసిన సిఫార్సుల్ని ఆర్థిక శాఖ తిరస్కరించింది. పట్టణంలో మురుగు నీరు రహదార్లపై పారి దుర్వాసన వెదుజల్లుతోంది. దాని మరమ్మతు కోసమ రూ.36 లక్షలు ఇచ్చేందుకు ఆర్థిక శాఖ మొండి చేయి చూపింద’ని మండిపడ్డారు. కొందరు  శాసనసభ్యులు ఆయన విమర్శలతో ఏకీభవించారు.  చివరగా మంత్రి నాగరాజు జోక్యం చేసుకుని వీలైనంత త్వరలో మార్కెట్‌ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు తగిని నిధులు విడుదల చేయిస్తామని సమాధానమిచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos