కూతురు చేసిన పనికి సునీత స్పందన..

  • In Film
  • December 14, 2019
  • 162 Views
కూతురు చేసిన పనికి సునీత స్పందన..

హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందం కోయిలకు ఏమాత్రం తగ్గని మధురమైన స్వరంతో తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా అందమైన గాయనిగా గుర్తింపు శాశ్వతం చేస్తున్న సునీత ఇటీవల తన కుమార్తె శ్రియా చేసిన ఓ పనికి ఉప్పొంగిపోతోంది. ఓ మంచి పనికోసం శ్రియ, ఆమె స్నేహితులందరూ కలిసి లక్ష రూపాయలను పోగు చేసి సీఎం రిలీఫ్ ఫండ్‌కు డొనేట్ చేశారు. ఈ మేరకు సునీత పోస్ట్ చేస్తూ.. ‘నా కూతురిని చూస్తే ఎంతో గర్వంగా ఉంది. ఓ మంచి మనిషిగా ఎదుగుతున్న ఆమెను చూస్తే ఎంతో సంతోషంగా ఉంది. గొప్ప పనిచేశారం’టూ పేర్కొంది.ఇక శ్రియా సైతం గాయనిగా తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైంది. సవ్యసాచి సినిమాలో ఓ పాట పాడిన విషయం తెలిసిందే..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos