హర్ ఘర్ తిరంగాను బహిష్కరించండి

హర్ ఘర్ తిరంగాను బహిష్కరించండి

చండిగడ్ : ‘హర్ ఘర్ తిరంగా’ను బహిష్కరించాలని శిరోమణి అకాలీదళ్ ఎంపీ సిమ్రన్ జిత్ సింగ్ మాన్ పంజాబ్ ప్రజలకు పిలుపునిచ్చారు. జాతీయ జెండాకు బదులు సిక్కులకు చెందిన ‘కేసరి’ జెండాలను ఎగురవేయాలని కోరారు. భారత సైనిక దళాలను ‘శత్రువు’ శక్తులుగా పేర్కొన్నారు. జర్నైల్ సింగ్ భింద్రన్వాలే ఆ శత్రు శక్తులతో పోరాడి వీరమరణం పొందాడని వ్యాఖ్యానించారు. మరో వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ పంజాబ్ ప్రజలు త్రివర్ణ పతాకాన్ని కాల్చేసి, ఖలిస్థానీ జెండా లను ఎగురవేసేలా వీడియోలో ప్రేరేపించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos