అఫ్గానిస్తాన్ హోం మంత్రి అమెరికాకు మోస్ట్ వాంటెడ్

అఫ్గానిస్తాన్ హోం మంత్రి  అమెరికాకు మోస్ట్ వాంటెడ్

వాషింగ్టనన్ : ఆఫ్ఘనిస్తాన్ హోం మంత్రి , హక్కానీ గ్రూప్ అధినేత సిరాజుద్దీన్ హక్కానీ పై సామాజిక మాధ్యమాల్లో పెద్ద యెత్తున చర్చ జరుగుతోంది. గత 20 ఏళ్లలో అఫ్గాని స్తాన్లో విధ్వంసకర దాడులకు తెగబడినట్లు హక్కానీ గ్రూప్ పై ఆరోపణలు ఉన్నాయి. దీనికి సిరాజుద్దీన్ అధిపతి. హక్కానీ నెట్వర్క్ చేసిన బాంబుదాడుల్లో దాడిలో 150 మందికిపైగా ప్రజలు మరణించారు. హక్కానీ నెట్వర్క్కు అల్ఖైదాతో దగ్గరి సంబంధాలున్నాయి. అమెరికా ఉగ్రవాద సంస్థల జాబితాలో హక్కానీ నెట్వర్క్ పేరు కూడా ఉంది. కాబుల్లోని ఓ హోటల్లో 2008 జనవరిలో జరిగిన ఓ ఉగ్రదాడికి సంబంధించిన కేసులో ప్రశ్నించేందుకు సిరాజుద్దీన్ కోసం ఎఫ్బీఐ వెతుకుతోంది. ఆ దాడిలో ఓ అమెరికా పౌరు డు సహా ఆరుగురు మరణించారు. నాటో దళాలపై వరుస దాడులకు సిరాజుద్దీన్ కుట్ర పన్నినట్లు ఎఫ్బీఐ అభియోగాలు. అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు హమిద్ కర్జాయ్పై కూడా 2008లో ఆత్మాహుతి దాడి చేపట్టినట్లు హక్కానీ పై ఆరోపణలు ఉన్నాయి. 2011 సెప్టెంబరు 2న కాబుల్లోని అమెరికా దౌత్య కార్యాలయానికి సమీపంలో నాటో దళా లపై జరిగిన దాడిని హక్కానీ నెట్వర్క్ చేపట్టిందని రుజువైంది. ఈ దాడిలో నలుగురు పోలీసు అధికారులు సహా ఎనిమిది మంది మరణించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos