ముస్లింలకు సిక్కుల మద్దతు

ముస్లింలకు సిక్కుల మద్దతు

లఖ్నవు: నూతన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఇక్కడి ఘంటాఘర్లో ముస్లిం మహిళలు చేపట్టిన ఆందోళనకు సిక్కులు మద్దతు పలి కారు. పొట్ట కూటి కోసం ఇతర దేశాల నుంచి వచ్చిన ముస్లిం లకూ పౌర సత్వాన్ని వితరణ చేయాలని ప్రార్థనలు చేశారు చలిని లెక్కచేయకుండా వందలాది మంది మహిళలు శాంతియుత ఆందోళన చేపట్టారు. వీరికి సంఘీ భావాన్ని తెలి పేందుకు వెళ్లిన సిక్కులు ప్రార్థనలు చేసిన తర్వాత ప్రసాదాన్ని పంచి పెట్టారు. ‘మాకు ఎవరితోనూ సమస్య లేదు. ముస్లిలను వదిలి పెట్టా రన్నదే మా బాధ. కొత్త చట్టంలో వారికి కూడా ప్రభుత్వం చోటు కల్పిస్తే వాళ్లతో కూడా మేము కలిసి జీవించగలం. పౌరస త్వాన్ని ప్రసాదించే విషయంలో మత వివక్షకు చోటు ఉండకూడదు. ఈ దేశం ప్రతి ఒక్కరిదీ’ అని హర్జిత్ పేర్కొన్నాడు. మహిళా ఆందోళన కారులకు మద్దతుగా హిందువులు హోమాన్ని చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos