పోలీసుల అదుపులో నటి శ్రద్ధా కపూర్ సోదరుడు సిద్ధాంత్‌

పోలీసుల అదుపులో నటి శ్రద్ధా కపూర్ సోదరుడు సిద్ధాంత్‌

బెంగళూరు: మాదక ద్రవ్యాల్ని ఆదివారం రాత్రి ఇక్కడ సేవించారనే ఆరోపణపై బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నామని పోలీస్ డిప్యూటీ కమిషనర్ భీమశంకర్ ఎస్ గులెడ్ తెలిపారు. ‘పక్కా సమాచారం మేరకు ఆదివారం రాత్రి పోలీసులు, పార్టీ జరుగుతోన్న ఎంజీ రోడ్లోని హోటల్లో సోదాలు చేశారు. బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్ను అదుపులోకి తీసుకున్నాం. ఆయన నుంచి సేకరించిన శాంపుల్స్ను పరీక్షించగా డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. డ్రగ్స్ తీసుకున్న ఆరుగురిలో సిద్ధాంత్ కూడా ఒకరు’’ అని పోలీసు వర్గాలు తెలిపాయి. హోటల్లో డ్రగ్స్ తీసుకున్నారా? లేదా బయట డ్రగ్స్ తీసుకొని పార్టీకి వచ్చారా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదని పోలీసులు చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos