కే ఏ పాల్‌పై నిప్పులు చెరిగిన యాంకరమ్మ…

కే ఏ పాల్‌పై నిప్పులు చెరిగిన యాంకరమ్మ…

ప్రముఖ టీవీ యాంకర్‌,మహిళా పాత్రికేయురాలు శ్వేతా రెడ్డి ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కే ఏ పాల్‌పై నిప్పులు చెరిగారు.సోమాజీగూడలోని ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ..కే ఏ పాల్‌ ఆహ్వానం మేరకు ఆయనపై నమ్మకంతో ప్రజాశాంతి పార్టీలో చేరామన్నారు.పార్టీలో చేరే సమయంలో పార్టీకి సరైన సిద్ధాంతాలు లేవని కే ఏ పాల్‌ను ప్రజలంతా ఒక కమెడియన్‌,బఫూన్‌గా,ఓ పిచ్చోడని భావిస్తున్నారని ఇపుడు నువ్వు కూడా ఆ పార్టీలో చేరితే నిన్ను కూడా అలానే చూస్తారని స్నేహితులు అన్నుడు వారందరితో ఒకటే మాట చెప్పానన్నారు.ప్రజలకు మంచి చేయడానికి,నిస్వార్థంగా సేవలు చేయడానికి మంచి మనుషులు రాజకీయాల్లోకి అడుగుపెడితే అలానే చూస్తారని అటువంటి విమర్శలు వస్తాయని స్నేహితులకు,బంధువులకు తెలిపి ప్రజాశాంతిలో చేరామన్నారు.అయితే తన భావన తప్పని కే ఏ పాల్‌పై స్నేహితులు,బంధువులు చెప్పిన మాటలు వాస్తవాలని తెలియడానికి ఎంతో సమయం పట్టలేదని ప్రజాశాంతిలో చేరే సమయంలో కే ఏ పాల్‌పై గొప్పగా చెప్పిన మాటలు వెనక్కి తీసుకుంటున్నామన్నారు.ప్రజాశాంతి తరపున హిందూపురం నియోజకవర్గం నుంచి తెదేపా ఎమ్మెల్యే బాలకృష్ణకు పోటీతా తమను అభ్యర్థిగా ప్రకటించారన్నారు.హిందూపురం నుంచి బాలకృష్ణ మాత్రమే కాదు ఇంకెవరు పోటీలో ఉన్నా మిమ్మల్ని గెలిపించి తీరుతానని శపథం చేసారని అయితే ఇపుడు మాట మార్చడం పాల్‌ నిజస్వరూపాన్ని తెలియజేస్తోందని ఆరోపించారు. ఈ నెల 21 వరకు 10 వేల సభ్యత్వాలు చేయించమన్నారని, 21వ తేదీ రాకముందే వైజాగ్‌ సభలో శ్వేతారెడ్డి అడ్రస్‌ లేకుండా పోయానని తనను అనడం వెనక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని శ్వేతారెడ్డి తెలిపారు. అసలు ఆ మీటింగులో తన ప్రస్తావన పాల్ ఎందుకు తెచ్చారో అర్థం కావడం లేదన్నారు.
హిందూపురం టికెట్‌ను ఇంకెవరికైనా అమ్ముకునేందుకు ఈ ప్రకటన చేశారా? అని ఆమె ప్రశ్నించారు. ప్రజాశాంతి పార్టీకి ఎజెండా లేదని, ఓ సిద్ధాంతం లేదని ఆరోపించారు. కేఏ పాల్‌ నోరు తెరిస్తే ట్రంప్, ఒబామా అంటున్నారని, మిలియన్స్, ట్రిలియన్స్‌ డాలర్లు అంటూ.. అమరావతి అభివృద్ధికి రూ.10 కోట్లు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. సభ్యత్వం పేరుతో రూ.10, 100 ఎందుకు వసూలు చేస్తున్నారో వివరించాలని ఆమె డిమాండ్‌ చేశారు. క్రిస్టియన్‌ కమ్యూనిటీని అవమానపరిచేలా పాల్‌ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓట్లను చీల్చేందుకు రాజకీయం చేస్తున్నట్లుగా తనకు అనుమానంగా ఉందన్నారు.  శ్వేతా రెడ్డి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కెఏ పాల్ పార్టీలో చేరి శ్వేతారెడ్డి ఎదుర్కొన్న చేదు అనుభవం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. జర్నలిస్టుగా పని చేసి ఆమె కెఏ పాల్‌ను నమ్మి ఆ పార్టీలో చేరడం, అది కూడా బాలయ్య లాంటి స్టార్ మీద గెలిపిస్తాననే పాల్ మాటలు నమ్మి చివరకు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడంపై రకరకాలుగా చర్చించుకంటున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos