షట్ డౌన్ చేయను

షట్ డౌన్ చేయను

వాషింగ్టన్: దేశం మొత్తాన్ని షట్డౌన్ చేయాలన్న వైద్యుల సూచనను పాటించనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళ వారం ఇక్కడ తేల్చి చెప్పారు. అది ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ‘ఈ విషయాన్ని వైద్యులకే వదిలేస్తే దేశం మొత్తం షట్డౌన్ చేయ మంటారు.  అలాగైతే ప్రపంచమంతా షట్డౌన్ చేయాలి. అంటే దాదాపు 150 దేశాలు షట్డౌన్ అవ్వాలి’ అన్నారు. ‘షట్డౌన్ బాగానే ఉంది. దానిని రెండేళ్లు కొనసాగిద్దామా! అది కుదరదని మీకూ తెలుసు. ఏ దేశంలోనూ ఆ పని చేయరు. ప్రత్యేకించి ప్రపంచ నంబర్ వన్ ఆర్థిక వ్యవస్థలో అస్సలు కుదరద’ రు. ‘షట్డౌన్ చేస్తే అసలు సమస్య కన్నా ఇతర సమస్యలు పెరుగుతాయి. ఈ రెండు వారాల్లో మనం మెరుగయ్యాం. సమస్య ఇప్పటికప్పుడే తగ్గిపోతుందని చెప్పను. అయితే ఈ పోరాట సమయంలో మనమెన్నో విషయాలు నేర్చుకుంటాం. భవిష్యత్తులో ఇది మనకు ఉపయోగపడుతుంది.‘చాలా ప్రాంతాల్లో కొవిడ్-19 లేదు. కొన్ని చోట్ల నామమాత్రంగా ఉంది. అలాంటప్పుడు దేశమంతా ఎందుకు లాక్ డౌన్ చేయాలి. న్యూయార్క్లో స్టాక్మార్కెట్ నడుస్తోంది. అన్నీ మూసేసి అద్భుతంగా ఉందని చెప్పలేం. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరణాలు సంభవిస్తాయి’ అని ట్రంప్ స్పష్టం చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos