శృతిహాసన్ ఫోటో పెట్టుకున్నందుకు జరిమానా విధించారు..

శృతిహాసన్ ఫోటో పెట్టుకున్నందుకు జరిమానా విధించారు..

పబ్లిసిటీ కోసం పెద్ద,మధ్యతరహా,చిన్న కంపెనీలు సినీ,క్రికెట్‌ రంగాలకు చెందిన ప్రముఖుల ఫోటోలను వాడుకోవడం అందరికీ తెలిసిన విషయమే.ఇక యువత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తమ అభిమాన నటీనటులు,క్రికెటర్ల ఫోటోలను మొబైళ్లలో,కంప్యూటర్లలో వాల్‌పేపర్లుగా పెట్టుకోవడం సర్వసాధారణ విషయం.ఇక వీధుల్లో చిన్నచిన్న వ్యాపారాలు చేసే వ్యాపారస్థులు పబ్లిసిటీ కోసం లేదా అందంగా కనిపించడం కోసం తమ దుకాణాల్లో నటీనటులు,క్రికెటర్ల ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు.పెద్దపెద్ద కంపెనీలు ఇలా చేస్తే ఊరుకోని సెలబ్రిటీలు ఇటువంటి చిన్న వ్యాపారస్థుల పట్ల ఉదాసీనంగానే వ్యవహరిస్తారు.కానీ అనుమతి లేకుండా ప్రముఖ హీరోయిన్‌ శృతిహాసన్‌ ఫోటోలు దుకాణంలో పెట్టుకున్నాడని పౌరసరఫరాల శాఖ అధికారులు చిన్న వ్యాపారికి జరిమానా విధించిన ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది.హైదరాబాద్ సుల్తాన్ బజార్ లోని ఒక చిన్న దుకణాం యజమాని తన దుకాణం అందంగా ఆకర్షణీయంగా కనిపించాలనే ఉద్దేశంతో తన అభిమాన నటి శృతిహాసన్‌ ఫోటోను దుకాణంలో పెట్టుకున్నాడు.మరి శృతి హాసన్‌ అభిమానులు చేశారో లేదా దుకాణం యజమాని అంటే గిట్టనివ్యక్తులు చేశారో తేలియదు కానీ అనుమతి తీసుకోకుండా శృతి హాసన్ ఫొటోలను పెట్టుకున్నట్లుగా కొంతమంది తెలంగాణ పౌర సరఫరాల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.దీంతో దుకాణంలో సోదాలు చేసిన చేసిన అధికారులు శృతిహాసన్‌ ఫోటోలు ఉండడాన్ని గమనించి దుకాణం యజమానిని ప్రశ్నించారు.ఫోటోలు పెట్టుకోవడానికి శృతిహాసన్‌ అనుమతి తీసుకున్నావా అంటూ దుకాణం యజమానిని ప్రశ్నించగా అనుమతి తీసుకోలేదని బదులిచ్చిన దుకాణం యజమాని.. తనకు తెలియక ఆమె ఫొటోలు వాడానని అలాంటి నియమ నిబంధనలు ఉంటాయనే విషయం కూడా తనకు తెలియదు అంటూ నెత్తి నోరు బాదుకున్నాడు. అయినా కూడా పట్టించుకోని అధికారులు దుకాణం యజమానికి రూ.7వేల జరిమానా విధించడంతో చేసేది లేక జరిమానా చెల్లించి తన దుకాణంలో శృతి హాసన్ ఫొటోలను తొలగించేశాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos