మోదీతో షా దాగుడు మూతలు

మోదీతో షా దాగుడు మూతలు

ముంబై : మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు భాజపా- శివసేన మధ్య జరిగిన ఒప్పందం గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అబద్ధాలాడుతున్నారని శివసేన నేత సంజయ్ రౌత్ గురువారం ఇక్కడ ఆరోపించారు. వంతుల వారీగా ముఖ్య మంత్రి పదవిని చేపట్టే అంశం గురించి అమిత్ షా ప్రధాని నరేంద్ర మోదీతో దాగుడు మూతలు ఆడారని మండి పడ్డారు. మహా రాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి దేవేంద్ర ఫడ్నవీస్ కొనసాగుతారని చెప్పిన పుడు జనబాహుళ్యంలో మోదీకి ఉన్న పేరు ప్రఖ్యాతుల దృష్ట్యా ప్రకటనలను అప్పుడు ఆక్షేపించలేదన్నారు. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి శివసైనికుడేనని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సైతం పలు సభల్లో ప్రస్తావించారని గుర్తుచేశారు. ఎన్నికలు ముగిసే వరకూ రెండు పార్టీల మధ్య సజావుగా ఉన్న సంబంధాలు ఒక్కసారిగా ఎందుకు దిగజారాయని ప్రశ్నించారు. శివసేనతో ఎన్నికలకు ముందు జరిగిన సంప్రదింపుల్లో ముఖ్యమంత్రి పదవిని చెరి రెండున్నరేళ్లు పంచుకునే అంశం లేదని అమిత్ షా పేర్కొన్నారు.

తాజా సమాచారం