ఏడు గురిని బలిగొన్న విషవాయువు

ఏడు గురిని బలిగొన్న విషవాయువు

వడోదర: గుజరాత్, వడోదరలో దర్శన్ హోటల్ సెప్టిక్ ట్యాంక్లో వెలువడిన విషవాయువును పీల్చి ఏడు గురు కార్మికులు శనివారం ప్రాణాలు కోల్పోయారు. హోటల్‌ యాజమాన్యానికి వ్యతిరేకంగా పోలీసులు కేసు దాఖలు చేసారు. పోలీసుల కథనం ప్రకారం సెప్టిక్ ట్యాంక్ను శుభ్రం చేసేందుకు ఆ హోటల్ యజమాని నలుగురు కూలీల్నిపురమాయించాడు. ట్యాంక్ లోకి దిగిన కూలీ ఎంతకీ బయటకు రాకపోవడంతో అతడ్ని వెతికేందుకు మిగతా ముగ్గురు కూలీలు లోపలికి వెళ్లారు. వీళ్లూ తిరిగి రాకపోవడంతో హోటల్లో సిబ్బంది ముగ్గురు సిబ్బంది కూడా ట్యాంక్లోకి దిగారు. వాళ్లూ రాక పోవడంతో హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అత్యవసర సిబ్బంది సాయంతో పోలీసులు ఏడుగురి మృతదేహాలను వెలికి తీశారు. ట్యాంక్లో వెలువడిన విషవాయువు పీల్చడంతో వీరంతా ఊపిరాడక మృతిచెందినట్లు పోలీసులు వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos