ఎన్డీయే నుంచి ఎలా తొలగిస్తారు?

ఎన్డీయే నుంచి ఎలా తొలగిస్తారు?

ముంబై: ‘..ఎన్డీయే నుంచి మమ్మల్ని తొలగించడానికి మీరెవరు’ అని శివసేన మంగళవారం తన అధికారిక పత్రిక సామ్నాలో భాజపాపై విరుచుకు పడింది. ‘ ప్రస్తుతం భాజపాలో కీలకంగా వ్యవహరిస్తున్న నాయకులెవరూ జన్మించని కాలంలోనే శివసేన హిందు త్వ సిద్ధాంతాలకు మద్దతుగా నిలిచింది. అలాంటి మమ్మల్ని ఎన్డీయే నుంచి తొలగించడానికి మీరెవరు? ప్రస్తుతం భాజ పా నాయకులంతా చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. వాజ్పేయి, ఆడ్వాణీ, ప్రకాశ్ సింగ్ బాదల్, జార్జి ఫెర్నాం డెజ్లతో కలిసి బాలసాహెబ్ ఠాక్రే ఎన్డీయేకు పునాదుల వేసారు. ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి చర్చలు జరుపుతున్నందునే ఎన్డీయే నుంచి తొలగిస్తున్నామనడం ఏమాత్రం సరైంది కాదు. ఎన్డీయే పక్షాల సమావేశానికి పిలిచి ఎందుకు మాట్లాడలేదు? జమ్మూ – కశ్మీర్లో పీడీపీతో, ఎన్నో విమర్శలు చేసిన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ని తిరిగి ఎన్డీయేలో చేర్చుకునేటప్పుడు భాజపా ఇతర పక్షాల్ని ఎందుకు సంప్ర దిం చలేదు. ఎవరూ మోదీకి మద్దతుగా నిలవని కష్ట కాలంలో కేవలం శివసేన మాత్రమే అండగా నిలిచింది. అలాంటి పార్టీ ని, అదీ బాల్ ఠాక్రే వర్ధంతి రోజు ఎన్డీయే నుంచి తొలగిస్తు న్నామని ప్రకటించటం పెద్ద తప్పు’అని ధ్వజమెత్తింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos