ఉచిత తాయిలాల’ కేసు మరో త్రిసభ్య ధర్మాసనానికి

న్యూ ఢిల్లీ: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు చేసే ఉచిత తాయిలాల వాగ్దానాలను నిషేధించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ శుక్రవారం మరో త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేశారు. న్యాయమూర్తులు సూర్యకాంత్, హిమా కోహ్లిలతో కూడిన సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఎన్నికల ప్రజా స్వామ్యం లో నిజమైన అధికారం ఓటర్లదేనని అభిప్రాయపడింది. ‘పన్ను చెల్లింపుదారుల నిధులను ఉపయోగించి అందించే ఉచితాలు పార్టీల ప్రజాదరణను పెంచే లక్ష్యంతో రాష్ట్రానికి ఉచితాలు అందించలేని పరిస్థితిని సృష్టించవచ్చని సొలిసిటర్ జనరల్, భారత ఎన్నికల సంఘం, ఇతర పార్టీలు పేర్కొన్నాయి. మేము అన్ని కోణాల నుంచి ఈ పరిస్థితిని పరిశీలించాము. అంతిమంగా నిర్ణయం ఓటర్ల చేతుల్లోనే ఉంటుంది. పార్టీల పనితీరును వాళ్లే నిర్ణయిస్తారు’ అని సీజేఐ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ‘ఈ విషయంలో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. 2013 బాలాజీ తీర్పు ప్రకారం టీవీలు మొదలైన వాటి పంపిణీ సంక్షేమ చర్య అని, అది ఉచిత ప్రయోజనం కాదు. ఉచితాల విషయాన్ని ఇప్పుడు మరో త్రిసభ్య ధర్మాసనం పునఃపరిశీలించనుంద’ని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos