రఘురాజుకి ఎడిమా, కాలివేలికి ఫ్రాక్చర్

అమరావతి: ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు శుక్రవారం ప్రారంభించింది. సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి వైద్యులు జరిపిన వైద్య పరీక్షల రిపోర్టును, వీడియో రికార్డింగు ఉన్న కవర్ ను జస్టిస్ వినీత్ శరన్ తెరిచారు. రఘురాజుకు జనరల్ ఎడిమా ఉందని, కాలి వేలికి ఫ్రాక్చర్ అయినట్లు నివేదికలో ఉందని చెప్పారు. విచారణ సందర్భంగా రఘురాజు తరపున ముకుల్ రోహత్గీ వాదించారు. లోక్సభ సభ్యుడికే ఇలా జరిగితే సామాన్యుడి పరిస్థితి ఏమిటని ఆందోళన చెందారు. రఘురాజును చిత్ర హింసలకు గురి చేశారనే విషయం తేలిపోయిందన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదించారు. ఆ గాయాలను రఘురాజు స్వయంగా చేసుకున్నారా? లేదా? అనే విషయం తెలియదన్నారు. సీఐడీ కస్టడీ నుంచి ఆర్మీ ఆసుపత్రికి వెళ్లే సమయంలో రఘురాజు గాయాలు చేసుకున్నారని మీరు అంటున్నారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. తదుపరి విచారణను మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos