ఎల‌క్టోర‌ల్ బాండ్ల‌పై 3 వారాల్లోగా పూర్తి వివ‌రాలు ఇస్తాం

ఎల‌క్టోర‌ల్ బాండ్ల‌పై 3 వారాల్లోగా పూర్తి వివ‌రాలు ఇస్తాం

న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్ల అంశంపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ సాగింది. మరో మూడు వారాల్లో ఆ బాండ్ల వివరాలను వెల్లడించనున్నట్లు కోర్టుకు ఎస్బీఐ తెలిపింది. నిజానికి జూన్ 30వ తేదీ వరకు పొడగింపు ఇవ్వాలని తొలుత ఎస్బీఐ తన అప్లికేషన్లో కోర్టును కోరింది. దానిపైనే సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఈ కేసును విచారిస్తున్నది. బాండ్లను ఎవరు కోనుగోలు చేశారన్న అంశంపై వివరాలను వద్దనుకుంటే మూడు వారాల్లోగా ఆ బాండ్ల వివరాలను వెల్లడించనున్నట్లు ఎస్బీఐ తెలిపింది. ఇంకా మూడు వారాల సమయం ఎందుకు అని కోర్టు ప్రశ్నించింది. రాజకీయ పార్టీలు ఇప్పటికే తమ బాండ్ల డబ్బుకు సంబంధించిన వివరాలను సమర్పించాయి కదా అని కోర్టు తెలిపింది. ఏప్రిల్ 12, 2019 నుంచి 15 ఫిబ్రవరి, 2024 మధ్య కాలంలో ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలు, విత్డ్రాకు చెందిన సమాచారాన్ని ఇవ్వాలని ఎస్బీఐని కోర్టు ఆదేశించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos