రష్యాతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లావాదేవీల బంద్

ముంబై: రష్యాతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అన్ని లావా దేవీల్ని నిలప నుంది. ఆ దేశ సంస్థలు, బ్యాంకులు, పోర్టులు, నౌకల తదితరాలతో ఎలాంటి లావాదేవీలను జరపరాదంటూ క్లయింట్లకు సూచించింది. ‘‘మా వ్యాపారం ప్రపంచమంతటా ఉంది. అమెరికా, ఐరోపా సమాఖ్య విధించిన నిబంధనలకు అనుగుణంగా మేం ముందుకు పోవాల్సి ఉంటుంది. వాటికి విరుద్ధంగా మేమేమీ నిర్ణయం తీసుకోలేం’’ అని ఆ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు వివరించారు. రష్యా ముడి చమురు, కజక్ సీపీసీ బ్లెండ్ ను తాము ఇక తీసుకోబోమని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos