వర్క్ ఫ్రం హోం శాశ్వతం కాకూడదు…

వర్క్ ఫ్రం హోం శాశ్వతం కాకూడదు…

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గత రెండు నెలలుగా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులు అందరూ ఇంటి నుంచి విధులు నిర్వహిస్తున్నారు. అయితే క్రమంగా లాక్డౌన్లో సడలింపులు రావడంతో.. ఉద్యోగులను తిరిగి ఆఫీసు రావాల్సిందిగా సంస్థలు పిలుపునిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ తమ ఉద్యోగులకు శాశ్వతంగా ఇంటి నుంచి పనిచేసుకునే అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. దీంతో ఇతర సంస్థలు కూడా ఇదే నిర్ణయం తీసుకుంటాయని అంతా భావించారు. కానీ, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యా నాదెళ్ల మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించారు. వర్క్ ఫ్రం హోంపై ఆయన సంచలన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే.. అది ఉద్యోగుల మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తుందని.. పరస్పర సంబంధాలు కూడా దెబ్బ తింటాయని ఆయన అన్నారు. న్యూయార్క్ టైమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా చర్చించుకోవడాన్ని.. వీడియో కాల్స్ ఎప్పటికీ భర్తీ చేయలేవని అన్నారు. ‘‘నేను మీటింగ్స్ని మిస్ అవుతున్నాను. ఒక వ్యక్తి మన పక్కనే ఉంటే ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు’’ అని నాదెళ్ల పేర్కొన్నారు. శాశ్వత వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు. దీనివలన కంపెనీల్లోని చాలా నియమ నిబంధనలు కూడా మార్చుకోవాల్సిన పరిస్థితులు వస్తాయని ఆయన స్పష్టం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos