ఈ చీర కట్టుకుంటే కరోనా ‘దూరం’

ఈ చీర కట్టుకుంటే కరోనా ‘దూరం’

భోపాల్: మధ్యప్రదేశ్ చేనేత కళాకారులు కరోనా నివారణకు సొగసరి చీరలకు ఔషధాలతో సొబగులద్దారు. సుగంధ భరితమై ఈ ఔషధ చీరలు త్వరలో అందరికీ అందుబాటులోకి రానున్నాయి. సుగంధ ద్రవ్యాలు యాలకలు, జాపత్రి, దాల్చిన చెక్క, మిరియాలు, వాము, బిర్యానీ ఆకు, వివిధ రకాల పుష్పాలు తదితరాల్ని చీరల వర్ణాల్లో రంగరించారు. వీటిని ధరించిన వారికి చర్మం ద్వారా వ్యాధి నిరోధక శక్తి అందుతుందని ఇక్కడి ఆయుర్వేద నిపుణులు పండిత్ కుషి లాల్ శర్మ, డాక్టర్ నితిన్ మార్వా తెలిపారు. చేనేతలు, హస్తకళల డైరెక్టరేట్ అధికారుల సలహాతో చేనేత కార్మికులు ఔషధ చీరలను రూపొందించారు. వందల ఏళ్ల నాటి ఆయుర్వేద విజ్ఞానం ఆధారంగా సాధారణ చేనేత చీరకు పలు దశల్లో ఆయుర్వేద గుణాల్ని పొందుపరుచుతారు. సుగంధ మూలికలను 48 గంటల పాటు నీటిలో నానబెట్టి తయారు చేసిన రసాన్ని ఆవిరిగా మార్చి ప్రతి చీరకూ దశల వారీగా పట్టిస్తారు. ప్రత్యేక నైపుణ్యంతో అత్యంత జాగ్రత్తగా చేసే ఈ ప్రక్రియలో ఒక్కో చీర తయారీకి 5 నుంచి 6 రోజుల సమయం పడుతుంది. భోపాల్లో తయారు చేస్తున్న ఈ చీరల్ని భోపాల్, ఇండోర్లతో పాటు గ్వాలియర్, ఖజురహో, పాచ్మడి, జబల్పుర్, సాంచి, మహేశ్వర్ తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం విక్రయిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos