దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్న కేంద్రం

దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్న కేంద్రం

ముంబై: రాజకీయాల కోసం సీబీఐ, ఇన్కమ్ టాక్స్, ఈడీ, ఎన్సీబీ వంటి దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ఎన్సీపీ అధిపతి శరద్ పవార్ విమర్శించారు. బుధవారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడారు.‘ రాష్ట్ర ప్రభుత్వ యాంటీ-నార్కోటిక్స్ సెల్స్ నిజాయితీగా, ముక్కుసూటి పద్ధతిలో విధులను నిర్వహిస్తోంది. ఎన్సీబీతో పోల్చుకుంటే పెద్ద మొత్తాల్లోనే మాదక ద్రవ్యాలను స్వాధీన చేసుకున్న సందర్భాలున్నాయి. పేరున్న వ్యక్తులను ఎన్సీబీ అరెస్టు చేయటం చూస్తుంటే కేంద్రం ఏదో చేస్తోందనే అనుమానాలకు తావిస్తోంది. ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాఖండే గురించి అధికారుల నుంచి సమాచారం కోసం ప్రయత్నిస్తున్నా. ఆయనను ఇంతకుముందు విమానాశ్రయంలో నియమించారు. ఏవేవో విషయాలు నాకు తెలుస్తున్నప్పటికీ పూర్తి సమాచారం లేనందున దానిపై మాట్లాడను. వివిధ కేసుల్లో ఎన్సీబీ స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలు చాలా తక్కువ మొత్తంలోనే ఉన్నాయి. చిన్నచిన్న ప్లాకెట్లు లేదా గ్రాముల్లోనే వాళ్లు పట్టుకున్నార’ని వివరించారు. ‘ఆర్యన్ దగ్గర ఎన్సీబీ అధికారులకు డ్రగ్స్ దొరకలేదని సిన్హా చెప్పారు. ఒకవేళ డ్రగ్స్ దొరికినా ఒక ఏడాది పాటు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి కేసుల్లో బ్లడ్, యూరిన్ టెస్టులు చేస్తారు. ఆర్యన్ కు ఆ పరీక్షలు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. సినీ పరిశ్రమలో భయస్తులు ఎక్కువగా ఉంటారు. ఇలాంటి అంశాలపై మాట్లాడేందుకు వారు భయపడుతుంటారు. ఇది ఇతరుల సమస్య, మనకెందుకులే అనే ధోరణిలో ఉంటారు. ఎవరి కష్టాల నుంచి వారే బయటపడాలని అనుకుంటుంటార’ని వ్యాఖ్యానించారు.
‘చైనాతో 13వ విడత చర్చలు ఫలవంతం కాకపోవడం ఆందోళనకరం. ఈ అంశాలపై తాము ఢిల్లీలోని పార్టీలతోనూ, కేంద్రంతోనూ మాట్లాడుతూనే ఉన్నాం. రక్షణ విషయాలపై రాజ్నాథ్ సింగ్, చైనా సరిహద్దు అంశంపై ఏకే ఆంటోనీ నాతో సంభాషించారు. జాతీయ భద్రత విషయంలో ఎలాంటి రాజకీయాలకు, విభేదాలకు తావులేద’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos