మద్యం పాలసీలో బీజేపీ హస్తం

మద్యం పాలసీలో బీజేపీ హస్తం

న్యూ ఢిల్లీ : ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై కుట్ర జరుగుతుందని.. ఇందులో బీజేపీ బడా నాయకుల ప్రమేయం ఉందని ఆప్నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ఆరోపించారు. మద్యం పాలసీ కేసులో ఇటీవల సుప్రీంకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. దాంతో ఆయన బుధవారం జైలు నుంచి విడుదలయ్యారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఢిల్లీ సీఎంను అరెస్టు చేసేందుకు ఎలా కుట్ర జరిగిందో చెప్పేందుకే మీడియా ముందుకు వచ్చానన్నారు. మద్యం కుంభకోణం బీజేపీ చేసిందని.. ఇందులో ఆ పార్టీ సినయర్ నేతల హస్తం ఉందని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మాగుంట శ్రీనివాసులు అనే వ్యక్తి మూడు వాంగ్మూలాలను ఇచ్చాడు. ఆయన తనయుడు రాఘవ్ ఏడు స్టేట్మెంట్లు ఇచ్చాడు. సెప్టెంబర్ 16న అరవింద్ కేజ్రీవాల్ మీకు తెలుసా? అని ఈడీ మొదటిసారి మాగుంట శ్రీనివాసులును ప్రశ్నించింది. సమయంలో ఆయన నిజమే చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్ను చారిటబుల్ ట్రస్ట్ భూ విషయంలో కలిసినట్లు చెప్పారు. ఆ తర్వాత ఆయన కొడుకు రాఘవ్ను అరెస్ట్ చేసి ఐదు నెలల పాటు జైలులో ఉంచితే.. మాగుంట మాట మార్చాడు. సెప్టెంబర్ 16న మాగుంటపై తొలిసారిగా చర్యలు తీసుకున్నారు. ఫిబ్రవరి 10 వరకు కేజ్రీవాల్పై స్టేట్మెంట్ ఇవ్వాలని కోరింది. ఆ తర్వాత ఆయన కుమారుడిని అరెస్టు చేశారు. మాగుంట రాఘవ్ వాంగ్మూలం ఏడుసార్లు తీసుకున్నారు. ఆరింట్లో అరవింద్ కేజ్రీవాల్కు వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదు. జులై 16న ఏడో స్టేట్మెంట్ అతను తన స్టాండ్ని మార్చుకొని కుట్రలో భాగమయ్యాడు.
ఐదు నెలల టార్చర్ తర్వాత అతని మారిపోయాడు. కేజ్రీవాల్కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చాడు’ అని తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే.. ఆ ఆరు స్టేట్మెంట్లు (రాఘవ్).. అతని తండ్రి రెండు స్టేట్మెంట్లను తొలగించారు. అరవింద్కు వ్యతిరేకంగా లేని, అరవింద్ కేజ్రీవాల్ పేరు ప్రస్తావించని వాంగ్మూలాలను విశ్వసించబోమని ఈడీ పేర్కొంది. తండ్రీకొడుకులపై ఒత్తిడి తెచ్చి అరవింద్ కేజ్రీవాల్పై స్టేట్మెంట్లు తీసుకున్నారు’ అని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీని మాగుంట శ్రీనివాసులు కలిసిన ఫొటోలున్నాయని.. జులై 16న కేజ్రీవాల్కు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వడంతోనే జులై 18న బెయిల్ మంజూరైందని.. ఇదో పెద్ద కుట్ర అంటూ సంజయ్ సింగ్ ఆరోపించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos