రష్మికకు అక్కగా సమంత..

  • In Film
  • August 8, 2020
  • 107 Views
రష్మికకు అక్కగా సమంత..

పెళ్లి తర్వాత కమర్షియల్ పాత్రల కంటే నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను చేసేందుకు సమంత ఎక్కువ ఆసక్తి చూపిస్తోంది. అందులో  భాగంగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కూడా ఎక్కువగా కమిట్ అవుతోంది. ఇప్పటికే ఈమె తమిళంలో రెండు సినిమాలకు దాదాపుగా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందబోతున్న ఒక ద్విభాష చిత్రంలో నయనతారతో సమంత స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించబోతున్న ఆ సినిమాలో నయన్ మరియు సమంతలు నటించబోతున్నట్లుగా చాలా రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా కథ నచ్చడంతో సమంత కాస్త పారితోషికం కూడా తగ్గించుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇక ఈమె మరో హీరోయిన్ తో కూడా స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఉందంటున్నారు.సమంతకు ఇటీవల ఒక యంగ్ డైరెక్టర్ అక్క చెల్లెల్ల నేపథ్యంలో కథను చెప్పాడట. ఆ కథ బాగా నచ్చడంతో చెల్లి పాత్రకు గాను రష్మికను ఆమె సిఫార్సు చేసిందట. ఆ దర్శకుడు రష్మికకు కూడా ఫోన్ ద్వారా కథ చెప్పగా సమంతతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఓకే అన్నట్లుగా తెలుస్తోంది. సమంత మరియు రష్మికలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ముచ్చటించుకోవడంతో పాటు ఒకరిపై ఒకరు పాజిటివ్ గా స్పందిస్తూ ఉంటారు.వారి స్నేహం కారణంగా ఈ మల్టీ లేడీ స్టారర్ మూవీ ఫిక్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని సినీ వర్గాల వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సమంత అక్కగా రష్మిక చెల్లి పాత్రలో నటించే అవకాశం ఉంది. అంతా ఓకే అయితే ఈ సినిమాను వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రారంభించే అవకాశం ఉందంటున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos