గేల్ చిట్కాతో రసెల్ సిక్సర్ల మోత

  • In Sports
  • April 24, 2019
  • 132 Views
గేల్ చిట్కాతో రసెల్ సిక్సర్ల మోత

క్రిస్‌
గేల్‌ ఇచ్చిన సలహాతో తానిప్పుడు సిక్సర్లు బాగా కొట్టగలుగుతున్నానని కేకేఆర్‌ ఆటగాడు
రసెల్‌ తెలిపాడు. గతంలో తాను చాలా తేలికైన బ్యాట్లను వినియోగించేవాడినని, గత టీ20 ప్రపంచ
కప్పులో డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉన్నప్పుడు గేల్‌ తన వద్దకు వచ్చి బరువైన బ్యాటు వాడితే
సులభంగా సిక్సర్లు కొట్టవచ్చని సలహా ఇచ్చాడని వివరించాడు. అప్పటి నుంచి తాను బరువైన
బ్యాట్లనే వాడుతున్నానని, తద్వారా తన దశ కూడా తిరిగిపోయిందని అన్నాడు. కాగా ఐపీఎల్‌
ఈ సీజన్‌లో రసెల్‌ దూకుడు మరీ ఎక్కువైంది. 217 స్ట్రైక్‌ రేట్‌తో అందరికన్నా ముందున్నాడు.
ఇప్పటి వరకు 65.33 సగటుతో 392 పరుగులు చేశాడు. ఇప్పటికే 41 సిక్సర్లు కొట్టాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos