సమాచార హక్కు హరణపై దుమారం

సమాచార హక్కు హరణపై దుమారం

న్యూఢిల్లీ: సమాచార హక్కు సవరణ ముసాయిదా పై గురు వారం రాజ్యసభలో దుమారం చెలరేగింది. మధ్యాహ్న భోజన విరామం తర్వాత రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ఈ ముసాయిదా పెట్టాలని సిబ్బంది, వ్యవహారాల శాఖమంత్రి జితేందర్ సింగ్కు సూచించినపుడు విప క్షాలు ఆక్షేపణ తెలిపాయి. ఈ బిల్లును తదుపరి పరిశీలనకు ఎంపిక సమితికి పంపాలని తీర్మానాలు అందజేశాయి. ఓటింగ్తో కలిసి దీని పై చర్చ సాగుతుందని డిప్యూటీ ఛైర్మన్ పేర్కొనటాన్ని విపక్ష సభ్యులు ఆక్షేపించారు. రెండింటిపై వేర్వేరుగా చర్చ జరపాలని పట్టుబట్టి ఆందోళనకు దిగారు. నినాదాలతో సభను హోరెత్తించారు. దీంతో సభ రెండు సార్లు వాయిదా పడింది. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా విపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించినాచర్చ కొనసాగింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos