ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు యూనియన్లదే బాధ్యత..

ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు యూనియన్లదే బాధ్యత..

ప్రభుత్వ తీరు వల్లే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు అంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ చేసిన హైకోర్టు ధర్మాసనం ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు చేసుకోవడానికి, గుండెపోటు రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయని, ప్రభుత్వం వల్ల ఆర్టీసీ కార్మికులు చనిపోయారు అనటానికి ప్రూఫ్ ఏంటి అని పిటిషనర్ ను ప్రశ్నించారు. దీంతో పిటిషనర్ ఆర్టీసీ కార్మికులు మరణానికి ముందు రాసిన సూసైడ్ నోట్ లను ధర్మాసనం ముందుంచారు.అలాగే తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించలేదని వ్యాఖ్యానించింది హైకోర్టు ధర్మాసనం. సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పారని తెలిపినా అధికారిక ఉతర్వులు ఏవీ అని ప్రశ్నించింది కోర్టు. అంతేకాదు ఆర్టీసీ కార్మికులు మరణానికి ముందు రాసిన సూసైడ్ నోట్ లను పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం, సమ్మెకు పిలుపునిచ్చింది యూనియన్ నాయకులు, సమ్మె చేసింది ఆర్టీసీ కార్మికులు కాబట్టి ఆర్టీసీ కార్మికుల మరణానికి బాధ్యత యూనియన్ నాయకులు వహించాలని వ్యాఖ్యానించింది.ఇక కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడంపై ప్రభుత్వం ఎలా బాధ్యత వహిస్తుందని ప్రశ్నించింది. ఆత్మహత్యలను ఆపడం ఎలాగో చెప్పాలని పిటిషనర్ ను అడిగింది న్యాయస్థానం. అలాగే గుండె పోటు రాకుండా నివారించడం ఎలాగ అంటూ ప్రశ్నించడం తో పాటుగా ఆర్టీసీ కార్మికుల మరణాలకు,ప్రభుత్వానికి సంబంధం లేదని తేల్చి చెప్పింది. సమ్మెకు కారణమైన యూనియన్లు బాధ్యత వహించాలని పేర్కొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos