రేవంత్‌ రెడ్డి కోసం పోలీసుల వెతుకులాట..

రేవంత్‌ రెడ్డి కోసం పోలీసుల వెతుకులాట..

డిమాండ్లు పరిష్కరించాలంటూ రెండు వారాలకు పైగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా కాంగ్రెస్ నేతలను ఎక్కడిక్కడ అరెస్టులు,గృహ నిర్బంధం చేస్తున్నారు.అందులో భాగంగా కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులు ఇంట్లో రేవంత్ రెడ్డి కనిపించకపోవడంతో గాలింపు చర్యలు చేపట్టారు.ఆదివారం రాత్రి నుంచి ఇంట్లో రేవంత్ లేరు. దీంతో, రేవంత్ కోసం ఆయన అనుచరుల ఇళ్లలో కూడా పోలీసులను సోదాలు నిర్వహించారు. ఇదే సమయంలో ప్రగతి భవన్ చుట్టుపక్కల ఉన్న హోటళ్లలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రగతి భవన్ వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు.మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిల కోసం కూడా పోలీసులు గాలింపులు చర్యలు చేపట్టారు.కాంగ్రెస్ కీలక నేతలు ఎక్కడ ఉన్నారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.మధిర ఎమ్మెల్యే మల్లుభట్టివిక్రమార్కను పోలీసులు అరెస్ట్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos