ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఇకమీదట ఆర్టీసీ సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వం నియమించిన అధ్యయన కమిటీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నివేదికను అందజేసిందని తెలిపారు. ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడానికి ముఖ్యమంత్రి సూత్రప్రాయంగా అంగీకరించారని చెప్పారు. మిగిలిన విధి విధానాలన్నీ త్వరలోనే ఖరారవుతాయన్నారు. ఆర్టీసీ ప్రజా రవాణా శాఖగా మారనుందని వెల్లడించారు. ఉద్యోగులను విలీనం చేయడానికే ఈ శాఖ ఏర్పడనుందన్నారు. విలీనం అనంతరం ఆర్టీసీ కార్మికుల వేతనాల రూపంలో ప్రభుత్వంపై రూ.3,500 కోట్ల భారం పడుతుందని తెలిపారు. ఆర్టీసీని లాభాల బాట పట్టించడానికి చర్యలు చేపడతామన్నారు. బుధవారం జరిగే మంత్రి వర్గ సమావేశంలో ఆర్టీసీ విలీనానికి ఆమోద ముద్ర పడనుందని ఆయన వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos