ఆర్ఆర్ఆర్ విడుదల అప్పుడే….

  • In Film
  • January 21, 2022
  • 97 Views
ఆర్ఆర్ఆర్ విడుదల అప్పుడే….

దర్శక ధీరుడు జక్కన్న ప్రతిష్టాత్మకంగా చెక్కిన చిత్రం రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్). వాస్తవానికి ఈ మూవీ ఈపాటికి విడుదలై అత్యధిక కలెక్షన్లతో దూసుకుపోవాల్సింది. కానీ అలా జరగలేదు. అందుకు దేశవ్యాప్తంగా కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరగడం, థియేటర్ ఆక్యుపెన్సీ, పలు రాష్ట్రాల్లో స్వల్ప లాక్‌డౌన్‌ వంటి అనేక కారణాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సినిమా విడుదలను వాయిదా వేయడానికి ఆర్ఆర్ఆర్ చిత్రబృందం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా విడుదల తేది ఏమై ఉంటుందన్న ఆసక్తి ప్రేక్షకులను ఇంకా వీడలేదు. ఎప్పుడూ రిలీజ్ చేస్తారా అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ టీమ్ ప్రేక్షకులకు, అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా కలకలం తొలగిపోయి అన్ని పరిస్థితులు అనుకూలించి పూర్తి ఆక్యుపెన్సీతో థియేటర్లు ప్రారంభమైతే మార్చి 18న విడుదల చేసేందుకు సిద్దంగా ఉన్నామని మేకర్స్ తెలిపారు. ఒకవేళ అలా జరగకుంటే ఎలాంటి పరిస్థితులున్నా ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో ఇన్నేళ్ల ప్రేక్షకుల నిరీక్షణకు తెరపడినట్లు ఉంది. ఈ ప్రకటనతో ఆర్ఆర్ఆర్ సుమారు 14 భాషల్లో విడుదలకానుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos