సంజయ్ రౌత్‌కు బెయిల్.

సంజయ్ రౌత్‌కు బెయిల్.

ముంబై : పత్రా చాల్ భూ కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో శివసేన రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్కు ముంబైలోని స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాదాపు మూడు నెలల తర్వాత ఆయనకు బెయిల్ లభించింది. ముంబై సబర్బన్ గోరేగావ్లోని పాత్రా చాల్ను పునరాభివృద్ధికి సంబంధించి ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలపై గత జూలైలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంజయ్ రౌత్ను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉన్నారు. తనపై కేసు అధికార దుర్వినియోగం, రాజకీయ ప్రతీకారానికి ఉదాహరణ అని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. అయితే సంజయ్ రౌత్ బెయిల్ పిటిషన్పై మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ)కి సంబంధించిన కేసులను విచారించేందుకు నియమించబడిన ప్రత్యేక న్యాయమూర్తి ఎం జి దేశ్పాండే విచారణ చేపట్టారు. సంజయ్ రౌత్ ప్రభావవంతమైన వ్యక్తి అని, ఆయన బయటకు రాగానే సాక్షులపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని బెయిల్ పిటిషన్ను వ్యతిరేకిస్తూ ఈడీ వాదనలు వినిపించింది. ఈ పిటిషన్పై ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత గత వారం న్యాయమూర్తి ఉత్తర్వులను రిజర్వ్ చేశారు. తాజాగా సంజయ్ రౌత్కు బెయిల్ మంజూరు చేస్తున్నట్టుగా ఆదేశాలు వెలువరించారు. రూ. 1,034 కోట్ల పాత్రా చాల్ భూ కుంభకోణం కేసులో సంజయ్ రౌత్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముంబై ‘చాల్’ రీ-డెవలప్మెంట్లో అవకతవకలు, సంజయ్ రౌత్ భార్య వర్ష రౌత్, అతని సహచరులకు సంబంధిత లావాదేవీలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో రౌత్ను ఈడీ అరెస్ట్ చేసింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్ రూ. 11.15 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇందులో వర్షా రౌత్ ఫ్లాట్తో పాటు.. సంజయ్ రౌత్ సన్నిహితుడు సుజిత్ పాట్కర్, సుజిత్ భార్య స్వప్న పాట్కర్ సంయుక్తంగా కలిగి ఉన్న ఎనిమిది ప్లాట్లు ఉన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos