సంకీర్ణ కూటమి నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధం

సంకీర్ణ కూటమి నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధం

ముంబై: సంకీర్ణ కూటమి నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. 24 గంటల్లో రెబల్ ఎమ్మెల్యేలు ముంబై చేరుకుంటే కూటమి నుంచి వైదొలిగే అంశాన్నిపరిశీలిస్తామన్నారు. వారి డిమాండ్లన్నీ పరిగణలోకి తీసుకుంటామన్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలలో 21 మంది తమతో టచ్లో ఉన్నారని తెలిపారు. వాళ్లంతా ముంబై చేరుకున్నాక పరిస్థితులు చక్కబడతాయన్నారు. ‘రెబల్ ఎమ్మెల్యేలు గౌహతి నుంచి కమ్యూనికేట్ చేయకూడదు. ముంబై తిరిగి వచ్చి ముఏఖ్యమంత్రితో చర్చించాలి. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవికి ఎలాంటి ఢోకా లేదు.. బలపరీక్ష జరిగినప్పుడు అందరూ చూస్తారు. బలపరీక్ష దాకా వస్తే అధికార కూటమి మహా వికాస్ అఘాడి గెలుస్తుంది. శివసేనకు ద్రోహం చేయాలనుకునేవారు బాల్థాక్రే అనుచరులు, నిజమైన శివ సైనికులు కాలేరు’ అంటూ వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos