లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలకు రోజా సేవలు..

లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలకు రోజా సేవలు..

లాక్డౌన్పరిస్థితుల్లో తెల్ల రేషన్కార్డు ఉన్నవారికి నిత్యావసరాలు అందించాలని జగన్ సర్కారు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో నగరిలో ఎమ్మెల్యే రోజా కార్యక్రమాన్ని దగ్గరుండి ప్రారంభించారు. రోడ్లపైకి వచ్చి పేదలకు  అవగాహన కల్పిస్తూ మరీ ఆమె సేవలు అందించారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ఆమె తన ఫేస్బుక్  ఖాతాలో పోస్ట్ చేశారు.నిత్యావసరాల కోసం సామాజిక దూరం పాటించకుండా రోడ్లపై వస్తోన్న వారికి ఆమె పలు సూచనలు చేశారు. క్యూలో నిలబడాలని దూరంగా ఉండాలని చెప్పారు. పోలీసులతో కలిసి అవగాహన కల్పించారు. అనంతరం స్వయంగా కూరగాయలు తూకం వేసి కొందరికి అందించారు. తెల్ల రేషన్కార్డుదారులకు రూ.1000 చొప్పున కూడా ఇస్తామని జగన్ఇప్పటికే పెద్ద మనసుతో ప్రకటించారని ఆమె చెప్పారు. ఆమె చేసిన పోస్టులు చూస్తోన్న నెటిజన్లు చాలా చక్కగా అవగాహన కల్పిస్తూ సేవలు చేస్తున్నారని, మేరు చాలా గ్రేట్మేడం అని కామెంట్లు చేస్తున్నారు.

సామాజిక దూరం పాటిస్తూ మొదలైన ఉచిత రేషన్ పంపిణీ. #APFightsCorona #StayHomeStaySafe #AndhraFightsCorona #Lockdown

Posted by Roja Selvamani on Saturday, March 28, 2020

తాజా సమాచారం

Latest Posts

Featured Videos