అడ్డంగా దొరికిపోయి వెక్కివెక్కి ఏడ్చింది..

అడ్డంగా దొరికిపోయి వెక్కివెక్కి ఏడ్చింది..

లంచం తీసుకుంటే ఎంతటి దారుణ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో కొద్ది రోజులుగా జరుగుతున్న ఘటనలు చూస్తున్నా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల తీరులో ఏమాత్రం మార్పు రావడం లేదు.తాజాగా రైతు నుంచి లంచం తీసుకుంటూ ఓ రెవెన్యూ ఇన్స్పెక్టర్ అడ్డంగా దొరికిపోయిన ఘటనతో మరోసారి రుజువైంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు రెవెన్యూ ఇన్స్పెక్టర్ సౌజన్య రాణి అవినీతి నిరోధకశాఖ అధికారులకు అడ్డంగా పట్టుబడింది. భీమడోలు పరిధిలోని ఓ గ్రామానికి చెందిన చొప్పిశెట్టి సత్యనారాయణ అనే వ్యక్తి ఇటీవల మరణించాడు. ఆయన కుమారుడు, కుమార్తె సైతం చనిపోయారు. వీరి తరఫున ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కావాలంటూ మృతిని భార్య బేబీ, మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోగా, ఆ పత్రాలు ఆర్ఐ సౌజన్యా రాణి కార్యాలయానికి చేరాయి.సర్టిఫికెట్ జారీ చేయాలంటే రూ.3వేలు లంచం ఇవ్వాలంటూ డిమాండ్ చేయడంతో బేబీ ఏసీబీ అధికారును ఆశ్రయించింది.ఈ నేపథ్యంలో కార్యాలయం వద్ద మాటు వేసిన ఏసీబీ అధికారులు, బేబీ నుంచి సౌజన్యా రాణి డబ్బు తీసుకుంటుండగా పట్టుకున్నారు.అడ్డంగా దొరికిపోవడంతో సౌజన్య రాణి వెక్కివెక్కి ఏడవసాగింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos