‘ప్రశాంత్ నీల్ ఇండియన్ సినిమా వీరప్పన్’

‘ప్రశాంత్ నీల్ ఇండియన్ సినిమా వీరప్పన్’

ముంబై : ‘కేజీఎఫ్2’ దర్శకుడు ప్రశాంత్ నీల్ పై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు కురిపించారు. ‘మీరు ఇండియన్ సినిమా వీరప్పన్’ అని కొనియాడారు దర్శకుల దినోత్సవం సందర్భంగా ప్రశాంత్ నీల్ కు శుభాకాంక్షలు తెలిపిన వర్మ… ‘కేజీఎఫ్2’ సినిమాతో కన్నడతో పాటు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ దర్శకులకు కనువిప్పు కలిగించారని చెప్పారు. రీ షూటింగులు, రీ డ్రాఫ్టులు, పునరాలోచనలతో టన్నుల కొద్దీ డబ్బును వృథా చేస్తున్నారని, వాళ్లు వృధా చేస్తున్న డబ్బుతోనే మీరు క్వింటాల్ డబ్బు సంపాదించారని ప్రశంసించారు. సినీ పరిశ్రమలో సంప్రదాయ బద్ధంగా ఉండే 95 శాతం మందికి ‘కేజీఎఫ్ 2’ నచ్చలేదని చెప్పారు. మీరు పాత ఇండస్ట్రీని బయటకు నెట్టేసి, కొత్త పరిశ్రమకు జీవం పోశారని.. దాని పేరే ‘కేజీఎఫ్ 2’ అని ప్రశంసించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos