ఎస్‌టీ స్థానంలో బీసీ పోటీ…!

హొసూరు : కృష్ణగిరి జిల్లా తళి యూనియన్‌లోని పాల్యం కోట పంచాయితీ అధ్యక్ష పదవిని ఎస్‌టీ మహిళ కేటాయించగా, బీసీ మహిళలు పోటీ చేస్తుండడం విమర్శలకు దారి తీసింది. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 27, 30 తేదీలలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయడానికి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీలకు పలు స్థానాల్లో ప్రభుత్వం రిజర్వేషన్‌ కల్పించింది. పాల్యం కోట గ్రామచాయతీ అధ్యక్ష పదవిని ఎస్‌టీ మహిళ కు కేటాయించారు. పుట్ట మాదమ్మ అనే ఎస్‌టీ మహిళ నామినేషన్ దాఖలు చేసింది. మరో ఇద్దరు బీసీ మహిళలు కూడా నామినేషన్

దాఖలు చేయడం పై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై అధికారులకు ఫిర్యాదు అందినా పట్టించుకోలేదు. గ్రామంలో ప్రాబల్య వర్గానికి చెందిన వారు ఎస్‌టీ స్థానంలో బరిలోకి దిగడం విడ్డూరమని స్థానికులు విమర్శిస్తున్నారు. వెంటనే బీసీ మహిళలను పోటీ నుంచి తప్పించాలని ఎస్‌టీ వర్గానికి చెందిన వారు అధికారులను కోరుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos