పవన్‌ తీరు ఆయోమయం

పవన్‌ తీరు ఆయోమయం

అమరావతి : జన సేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీరు ప్రజలను అయోమయానికి గురి చేసే విధంగా ఉందని వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి శనివారం ట్వీట్లో ఎద్దేవా చేసారు.‘నిజ జీవితంలో ఆయన పోషిస్తోన్న పాత్ర ఫ్లాప్ మూవీలో ద్వి పాత్రా భినయం చేస్తున్నట్లు ఉంది. ఒక సినిమాలో హీరోగా, మరో మూవీలో విలన్ గా నటిస్తే ఎవరికీ అభ్యంతర ముండదు. కానీ ఒకే సినిమాలో ఆ నటుడు కథా నాయకుడిగా, విలన్ గా నటిస్తే ప్రేక్షకులు అయోమయానికి గురవుతారు. సినిమా ఫ్లాప్ అవు తుంది. ఇప్పుడా ఫ్లాప్ మూవీలోనే పవన్ నాయుడు ద్విపాత్రాభినయం చేస్తున్నాడ’ని హేళన చేసారు. ‘తన కుటుంబ సభ్యు లైతే ఒకలా. పరాయి ఆడపిల్ల అయితే మరోలా మాట్లాడుతున్నారు. రేప్ చేస్తే ఉరి తీస్తారా? రెండు బెత్తం దెబ్బలు కొడితే చాలని తీర్పు చెప్పిన దత్తపుత్రుడికి నా సానుభూతి. నా సోదరిని ఎవరో వేధిస్తే కత్తితో పొడవాలనిపించిందని చెప్పుకున్నారు. పరాయి ఆడపిల్ల అయితే శిక్షల గురించి మరోలా మాట్లాడే వ్యక్తి నీతులు చెబుతుండడం దురదృష్టకరం’ అని మరో ట్విట్లో మండి పడ్డా రు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos