మధురలో రావణాసురునికి పూజలు

మధురలో రావణాసురునికి పూజలు

మధుర : రావణాసురునిపై శ్రీరాముడి విజయాన్ని ఉత్తరాదిలో దసరా సందర్భంగా జరుపుకోగా ఉత్తర ప్రదేశ్లోని యమునా నది ఒడ్డునగల ఓ శివాలయంలో రావణా సురు డికి వేద మంత్రాలు, శంఖ ధ్వని నడుమ పూజలు జరిపారు. రావణాసురుడి బొమ్మను దహనం చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిం చిన లంకేష్ మిత్ర మండల్ కోరింది. మండల్ జాతీయ అధ్యక్షుడు ఓమ్ వీర్ సారస్వత్ ఈ సందర్భంగా మాట్లాడారు. ‘దేశ రాజధాని నగరం ఢిల్లీ, పరిసరాలను కలుషితం చేస్తున్న పంట దుబ్బుల కాల్చివేతను నిషేధించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అదే విధంగా రావణాసురుడి బొమ్మను దహనం చేయకుండా కూడా చర్యలు తీసుకోవాలి. రావణాసురుడి బొమ్మను దహనం చేయడం వల్ల కూడా పర్యావరణం కలుషితమవుతుంది. ఈ బొమ్మలను దహనం చేయడాన్ని నిరోధించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. కాబట్టి మేము భారత ప్రధాన న్యాయమూర్తిని సంప్రదిస్తాం. సీతా దేవిని రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోవడం క్షమించదగినదే. తన సోదరి శూర్ప ణఖను లక్ష్మణుడు అవమానించినందుకు ప్రతీకారం తీర్చుకోవడానికే ఆమెను ఎత్తుకెళ్ళాడు. శ్రీరామునికి రావణాసురుడు పురోహితుడిగా వ్యవహరించి, ఆయన విజయం సాధించాలని ఆశీర్వదించాడు. రావణాసురునికి పూజలు చేయడానికి ముందు తాము శివునికి పెరుగు, పాలు, తేనె, నెయ్యి, ఖండసారిలతో అభిషేకం చేశాం’ అన్నారు. ఈ ఏడాది కోవిడ్-19 మహమ్మారి నిరోధక ఆంక్షలు అమలవుతుండటం వల్ల మధురలోని రామలీల మైదానంలో రావణాసురుడు, మేఘనాథుల బొమ్మలను దహనం చేయ లేదని జిల్లా కలెక్టర్ నవనీత్ సింగ్ తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos