కరోనాపై పోరాటానికి టాటా ట్రస్ట్ రూ.1,500 కోట్ల భారీ విరాళం..

కరోనాపై పోరాటానికి టాటా ట్రస్ట్ రూ.1,500 కోట్ల భారీ విరాళం..

కరోనాపై పోరాటానికి సామాన్య ప్రజల నుంచి ప్రధాన మంత్రి వరకు అంతా ఏకమయ్యారు.కరోనా అంతు చూడడానికి ఏర్పాటు చేసిన ప్రధాన మంత్రి సురక్ష నిధికి సామాన్యుల నుంచి పెద్ద పెద్ద వ్యాపారవేత్తల వరకు తమ శక్తికి తగినవిధంగా విరాళం అందిస్తున్నారు.ఇప్పటికే అన్ని చిత్ర పరిశ్రమలకు చెందిన నటులు విరాళాలు ఇవ్వగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ రూ.25 కోట్లు,బీసీసీఐ రూ.51 కోట్ల భారీ విరాళాలు ఇచ్చారు.ఈ క్రమంలో కరోనా మహమ్మారిపై పోరాటానికి టాటా ట్రస్ట్ రూ.1,500 కోట్లు అందిస్తోంది. ఈ నిధులను కరోనా సోకిన వారికి చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి, రెస్పిరేటరి సిస్టమ్స్, టెస్టింగ్ కిట్స్ తయారీకి, వైరస్ సోకిన వారికి మాడ్యులర్ చికిత్సా సౌకర్యాల ఏర్పాటు, ఆరోగ్యకార్యకర్తల శిక్షణ, జనరల్ పబ్లిక్.. ఇలా వివిధ అవసరాల కోసం వీటిని ఉపయోగిస్తామని టాటా ట్రస్ట్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో టాటా ట్రస్ట్ రూ.500కోట్లు, టాటా గ్రూప్ హోల్డింగ్ సంస్థ అయిన టాటా సన్స్ రూ.1,000 కోట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా రతన్ టాటా మాట్లాడుతూ.. దేశంలో, ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. దీనికి తక్షణ చర్యలు అవసరమని చెప్పారు. దేశంలోని అవసరాలకు అనుగుణంగా టాటా ట్రస్ట్, టాటా కంపెనీలు ఎదిగాయని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో దీనిని అదుపు చేయడానికి మించిన ప్రాధాన్యత లేదన్నారు. ఈ కష్టకాలంలో కరోనాతో పోరాడేందుకు అత్యవసర వనరులను ఉపయోగించాల్సిన అవసరం ఉందని తాను భావిస్తున్నానన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos