ర‌ణ్‌వీర్ సింగ్ కారును ఢీ కొట్టిన బైకు..

  • In Film
  • October 16, 2020
  • 24 Views
ర‌ణ్‌వీర్ సింగ్ కారును ఢీ కొట్టిన బైకు..

కరోనా కారణంగా చాలా కాలంగా ఇళ్లకే పరిమితమైన హీరోలు ఇప్పుడిప్పుడే షూటింగులు తదితర చిత్ర పనుల్లో పాల్గొంటున్నారు.ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్ తన కొత్త చితం డబ్బింగ్ కోసం స్టూడియోకి వెళ్ళాడు.డబ్బింగ్ పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి వెళుతుండగా ర‌ణ్‌వీర్ ప్రయాణిస్తున్న కారును ఒక బైక్ వ్యక్తి స్పీడ్ గా వచ్చి ఢీ కొట్టాడు.వెంట‌నే అత‌ను కారు దిగి ఆ డ్యామేజ్ ప్రాంతాన్ని చెక్ చేసుకున్నాడు. ర‌ణ్‌వీర్ రోడ్డు మీద‌కు రావ‌డంతో అక్క‌డున్న వారంతో ర‌ణ్‌వీర్ ను త‌మ కెమెరాలో బంధించారు. ర‌ణ్‌వీర్ కారు దిగి పరిశీలించడం, ఆ వెంటనే మళ్లీ కారెక్కి వెళ్ళిపోవ‌డాన్ని వీడియో తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో అది వైర‌ల్‌గా మారింది.కారుకు ఎలాంటి డ్యామేజీ లేకపోవడం వల్ల వెనుక నుండి కారును ఢీ కొట్టిన బైక్ వాలాపై ఎలాంటి చర్యలు తీసుకోవడం కాని అతడితో వాదనుకు దిగడం కాని జరగలేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos